: పవన్ 'జనసేన'కు రాజకీయ పార్టీగా ఈసీ గుర్తింపు
నటుడు పవన్ కల్యాణ్ నెలకొల్పిన 'జనసేన'కు కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. 24 నవంబర్, 2014 నుంచి జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీపై గతంలో కొందరు చేసిన అభ్యంతరాలను ఈసీ తోసిపుచ్చింది. త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి జనసేన దరఖాస్తు చేసుకుందని తెలుస్తోంది. దాంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఇకనుంచి ఈ పార్టీ కీలక పాత్ర పోషించనుంది. ఈ ఏడాది దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ తన సొంత పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చి గెలుపొందేలా ప్రచారం చేశారు.