: ఇక ఇతర నేతల విగ్రహావిష్కరణకూ వైఎస్ జగన్ సై!
నిన్నటిదాకా దివంగత నేత, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణలకే పరిమితమైన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై ఇతర నేతల విగ్రహాలను ఆవిష్కరించేందుకు కూడా మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా పర్యటనలు కూడా సాగించనున్నారు. నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న జగన్, జిల్లాలోని యద్ధనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మొన్నటిదాకా ఓదార్పు యాత్ర సహా మిగిలిన పర్యటనల్లో జగన్... వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తూపోయారు. ఇప్పటిదాకా ఇతర నేతల విగ్రహాలను జగన్ ఆవిష్కరించిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే తాజాగా తన పంథాను మార్చుకున్న జగన్, ఇతర నేతల విగ్రహావిష్కరణలకూ నేడు శ్రీకారం చుట్టనున్నారు.