: 'హ్యాపీ బర్త్ డే టూ యూ ప్రణబ్ జీ'... శుభాకాంక్షలు తెలిపిన మోదీ
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు 79వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నట్టు మోదీ తెలిపారు. కాగా, ప్రణబ్ జన్మదినం సందర్భంగా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.