: నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో అరుణ్ జైట్లీ భేటీ


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల తరఫున యనమల రామకృష్ణుడు, ఈటెల రాజేందర్ లు హాజరుకానున్నారు. పన్నుల్లో కేంద్రం, రాష్ట్రాల వాటాలపై కీలక చర్చ జరగనున్న ఈ సమావేశంలో జీఎస్ టీ పన్నుపైనా చర్చించనున్నట్లు సమాచారం. పరోక్ష పన్నులన్నింటికీ స్వస్తి పలికి వాటి స్థానంలో జీఎస్ టీ పన్నును వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్రాలను తనదారికి తెచ్చకునేందుకే కేంద్రం ఈ భేటీని నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News