: సత్యార్థి, మలాలాకు మోదీ అభినందనలు
ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి, మలాలా యూసుఫ్ జాయ్ లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ లో బాలల హక్కుల కోసం కైలాష్ సత్యార్థి, పాకిస్థాన్ లో బాలికల విద్య కోసం మలాలా చేసిన విశేష కృషికి గుర్తింపుగా వారిద్దరికీ సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రకటించిన నోబెల్ కమిటీ బుధవారం ఓస్లోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బహుమతిని ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వారిద్దరికీ అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘ఓస్లోలో జరిగిన కార్యక్రమాన్ని దేశం యావత్తు గర్వంగా వీక్షించింది. సత్యార్థీ, నీకు శుభాభినందనలు’ అంటూ కైలాష్ సత్యార్థికి, ‘ఘనకార్యం సాధించిన మలాలాకూ అభినందనలు’ అంటూ మలాలాకు వేర్వేరుగా ఆయన అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు.