: రాజధాని ఒప్పందంలో లోపాలు లేవు: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ పై సింగపూర్ తో చేసుకున్న ఒప్పందంలో ఎటువంటి లోపాలు లేవని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్ బృందంతో ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం గురించి కేంద్రానికి తెలుసని అన్నారు. సింగపూర్ బృందంతో ఏరియల్ సర్వే అద్భుతంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇన్ క్యాప్ ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ ఆఫ్ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదిరిందని ఆయన అన్నారు. తొందర్లోనే రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతంలోని ప్రతి గ్రామాన్ని సింగపూర్ ప్రతినిధుల బృందం పర్యటిస్తుందని, ఆ తరువాత ప్రాథమిక నమూనా, అనంతరం పూర్తి స్థాయి ప్రణాళికను సింగపూర్ అందజేస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News