: సత్యార్థి, మలాలా బాలల సమస్యలపై పోరాటం చేశారు: నోబెల్ కమిటీ
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలిద్దరూ బాలల సమస్యలపై పోరాటం చేస్తున్నారని నోబెల్ కమిటీ పేర్కొంది. నార్వేలోని ఓస్లో సిటీ హాల్ లో జరిగిన నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఒకరు కృషిచేస్తే, మరోకరు బాలికా విద్య కోసం పోరాటం చేశారని అన్నారు. కైలాష్ సత్యార్థి, మలాలా ఇద్దరూ తమ పోరాటాల ద్వారా బాలల హక్కులకు ప్రచారం కల్పించారని కమిటీ వివరించింది. ఈ ప్రయాణ పోరాటంలో వారు ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారని నోబెల్ కమిటీ చెప్పింది.