: నోబెల్ శాంతి పురస్కారం స్వీకరించిన సత్యార్థి, మలాలా
భారత్ కు చెందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ నోబెల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాన్ని నోబెల్ కమిటీ నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాంతి కచ్చేరీలో భారతీయ సంగీత విద్వాంసుడు, సరోద్ వాద్యకారుడు అయిన అంజాద్ అలీ ఖాన్ తన ఇద్దరు కుమారులతో కలసి కచేరీ నిర్వహించారు.