: 17 ఏళ్ల అబ్బాయి, 25 ఏళ్ల అమ్మాయి... పెళ్లయినా దూరంగానే!
వయసులో తన కంటే పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు. తను కూడా సరేనంది. మూడు ముళ్లు, ఏడడుగులతో ఒకటయ్యారు. అంతలోనే వాళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. విషయమేంటంటే, తమిళనాడు సేలం జిల్లాలో 17 ఏళ్ల అబ్బాయి, ఓ కాటన్ మిల్లులో పనిచేస్తున్న 25 ఏళ్ల అమ్మాయిని వివాహమాడాడు. పెళ్లి అనంతరం వధువు ఇంటికి వెళ్లారు. కానీ, పెద్దలు నిరాకరించడంతో, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అబ్బాయి మైనర్ అని గుర్తించిన పోలీసులు, మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అబ్బాయికి పెళ్ళి వయసు వచ్చిన తర్వాత వీరిద్దరికీ వివాహం జరిపిస్తామని ఇరు కుటుంబ పెద్దలతో పోలీసులు లేఖలు రాయించుకుని, నూతన వధూవరులను ఎవరింటికి వాళ్ళను పంపారు.