: కప్పట్రాళ్ల తీర్పు ఫ్యాక్షనిస్టులకు కనువిప్పు కావాలి: కర్నూలు జిల్లా ఎస్పీ
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో నేడు ఆదోని సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పుతో ఫ్యాక్షనిస్టులకు కనువిప్పు కలగాలని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అన్నారు. కప్పట్రాళ్ల కేసులో ఆదోని కోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆదోని, కప్పట్రాళ్లలో ఆయన భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అంతేకాక కప్పట్రాళ్లలో ఉద్రిక్తతలను నివారించేందుకు ఆయన రెండు రోజుల పాటు ఆ గ్రామంలోనే బస చేశారు. కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఈ తీర్పు నేపథ్యంలోనైనా ఫ్యాక్షనిస్టులు పగలు, ప్రతీకారాలు మానుకోవాలని పిలుపునిచ్చారు.