: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తుందన్న నమ్మకం లేదు: వీహెచ్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపణలు చేశారు. హుదుద్ తుపాన్ సహాయనిధికి ఎన్టీఆర్ఎఫ్ నుంచి ఏపీకి రూ.500 కోట్లు వచ్చాయని, కానీ ప్రధాని సహాయ నిధి నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని అన్నారు. మరి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించిన మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నిలదీయలేదని వీహెచ్ ప్రశ్నించారు. చూస్తుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News