: మరికొద్ది సేపట్లో ఢిల్లీకి గవర్నర్ నరసింహన్
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈ రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవుతారు. ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న గవర్నర్ రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశం కానున్నారు. ఉన్నట్టుండి గవర్నర్ ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే క్రమంలోనే గవర్నర్ ను ఉన్నపళంగా ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం కోరినట్లు సమాచారం. ప్రధానితో భేటీ తర్వాత రేపు మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో జరిగే ఓ కార్యక్రమంలోనూ గవర్నర్ పాల్గొంటారు.