: 2015లో దేశ ఆర్థిక వృద్ధి 5-6 శాతం మధ్య ఉంటుంది: మూడీస్


భారతదేశ ఆర్థిక వృద్ధి 2015లో ముందుకు కదులుతుందని, 5 నుంచి 6 శాతం మధ్యలో ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. దేశీయంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలోనే ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. "2015 కల్లా దేశ స్థూల దేశీయ ఉత్పత్తి బలంగా ఉంటుంది. 2014లో 5 శాతంగా ఉన్న వృద్ధి తరువాత 5 నుంచి 6 శాతం మధ్య ఉండవచ్చు" అని '2015 అవుట్ లుక్-గ్లోబల్ క్రెడిట్ కండిషన్స్' పేరుతో విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. కాగా, బలమైన దేశీయ డిమాండ్ ఆధారంగా లబ్ధి పొందడం, మందగిస్తున్న చైనీస్ ఆర్థిక ప్రభావం నుంచి ఎగుమతి మర్కెట్లకు వచ్చే రక్షణ, జపాన్, యూరో జోన్ బలహీన వృద్ధి కారణంగా భారత్ ప్రయోజనం పొందుతుందని పేర్కొంది. "ఉద్యోగం, వినియోగం భారత్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ధరలు తగ్గడంతో దేశంలో అధికంగా ద్రవ్యోల్బణం తగ్గేందుకు సహాయం పడుతుంది" అని మూడీస్ వివరించింది.

  • Loading...

More Telugu News