: తొలిసారిగా యుద్ధ నౌకను ఎగుమతి చేయనున్న భారత్


యుద్ధ నౌకలను తయారు చేసి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్ చేరనుంది. కోల్ కతాలోని గార్డెన్ షిప్ బిల్డర్స్ రూ.350 కోట్ల వ్యయంతో తయారు చేసిన యుద్ధ నౌక 'బర్రకుడా' మరో 10 రోజుల్లో మారిషస్ కు ఎగుమతి కానుంది. 75 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుండే ఈ షిప్ లో ఒకేసారి 20 మంది నావికులు ప్రయాణించవచ్చు. ఇది చిన్న యుద్ధ నౌక అయినప్పటికీ తొలిసారిగా ఇండియా నుంచి ఎగుమతి కానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నౌకను మారిషస్ తమ పరిధిలోని సముద్ర జలాల్లో నిఘా నిమిత్తం వాడనుంది. కాగా, గోవా షిప్ యార్డ్ లో నిర్మాణంలో ఉన్న మరో రెండు నౌకలు త్వరలో శ్రీలంకకు ఎగుమతి కానున్నాయి.

  • Loading...

More Telugu News