: ఐఏఎస్, ఐపీఎస్ ల పంపిణీపై నేడు తుది కసరత్తు
తెలుగు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై నేడు తుది కసరత్తు జరగనుంది. నేటి మధ్యాహ్నం ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ పలుమార్లు భేటీలు నిర్వహించినా నేటికీ తన కసరత్తును పూర్తి చేయలేకపోయింది. ఇటీవల కమిటీ పంపిన ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.