: తొలి టెస్ట్ కు రెండోసారి వర్షం అడ్డంకి... ఆసిస్ తరఫున రెండో సెంచరీ నమోదు
వర్షం కారణంగా కొద్దిసేపు నిలిచిన తొలి టెస్టు రెండోసారి వర్షం కారణంగానే నిలిచిపోయింది. రెండో రోజు ఆటలో భాగంగా కొద్దిసేపటి ముందు వర్షం కారణంగా ఆట నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ప్రారంభమైన మ్యాచ్ క్షణాల్లోనే మరోమారు నిలిచిపోయింది. ఈ స్వల్ప విరామంలో ఆసిస్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ క్లార్క్ (98) సెంచరీకి చేరువయ్యాడు. ఆట నిలిచే సమయానికి ఆసిస్ 103.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 103 పరుగులు సాధించాడు. స్టీవ్ స్మిత్ సెంచరీతో ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లోనే రెండు సెంచరీలు నమోదు చేసింది. కెప్టెన్ రూపంలో మూడో సెంచరీ కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి.