: తప్పుడు ప్రచారం చేసేవారి అంచనాలను తొక్కుకుంటూ వెళతాం: సీఎం కేసీఆర్


ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే వారి అంచనాలను తొక్కుకుంటూ ముందుకు సాగుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగకుండా కొందరు యత్నిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. నగరంలో చారిత్రక స్థలాలు, ప్రార్థనా మందిరాలు చెక్కుచెదరని రీతిలో మెట్రో రైలు ముందుకుసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తొలుత ప్రతిపాదించినట్లుగా కాకుండా అసెంబ్లీ, కోఠీ వెనుక వైపు నుంచి మెట్రో రైలు వెళుతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News