: కప్పట్రాళ్ల కేసులో నేడు తుది తీర్పు... ఆదోనిలో హైటెన్షన్


తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో కర్నూలు జిల్లా ఆదోని కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. 2008లో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు బృందంపై బాంబులతో దాడి చేసిన ప్రత్యర్ధులు కత్తులతో పొడిచి మరీ హత్య చేశారు. నాడు వెంకటప్పనాయుడు సొంత గ్రామం కప్పట్రాళ్ల సహా ఆదోని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో తుది తీర్పు నేపథ్యంలో కప్పట్రాళ్లతో పాటు ఆదోనిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేసిన పోలీసులు ఆదోనిలో భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే, గ్రామంలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చే క్రమంలో జిల్లా ఎస్పీ రవికృష్ణ శనివారం రాత్రి కప్పట్రాళ్లలో బస చేశారు. కోర్టు తుది తీర్పు నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News