: ఐసీసీ భజ్జీ, ఓజాపైనా చర్యలు తీసుకోనుందా?


నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, సయీద్ అజ్మల్, మహ్మద్ హఫీజ్ తదితర స్పిన్నర్లను సస్పెండ్ చేసిన ఐసీసీ తాజాగా మరికొందరిపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఐసీసీ తాజా జాబితాలో సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా కూడా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఐసీసీ టెక్నికల్ కమిటీ బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ను అప్రమత్తం చేసిందట. భజ్జీ 2011 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండగా, గతేడాది వెస్టిండీస్ తో టెస్టు సిరీసే ఓజాకు చివరిది. హర్భజన్ బౌలింగ్ పై ఆరోపణలు ఇప్పటివి కావు. భజ్జీ బౌలింగ్ శైలిని ఆసీస్ అంపైర్ డారెల్ హెయిర్ ఎన్నోమార్లు తప్పుబట్టారు. ఇదిలా ఉంటే, ఐసీసీ కన్నేసిన కారణంగానే బీసీసీఐ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక సందర్భంగా వీరిద్దరినీ పరిగణనలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. కాగా, సస్పెన్షన్ వేటుకు గురై, యాక్షన్ సరిదిద్దుకున్న శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకేను తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు ఐసీసీ మంగళవారం అనుమతించింది.

  • Loading...

More Telugu News