: జార్ఖండ్ లో పోలీసులకు ఖైదీల ఝలక్


పాత సినిమాల్లో సన్నివేశం వంటి ఘటనే జార్ఖండ్ లో చోటుచేసుకుంది. జైలు నుంచి న్యాయస్థానానికి తీసుకెళుతుండగా ఖైదీలు పోలీసులకు ఝలకిచ్చారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ జైలు నుంచి ఖైదీలను న్యాయస్థానానికి తీసుకెళుతుండగా పోలీసుల కళ్లు గప్పిన 17 మంది ఖైదీలు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించగా, మిగిలిన 15 మంది పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎంత గాలించినప్పటికీ ప్రయోజనం కనిపించ లేదు. ఇప్పటి వరకు ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News