: కత్తులతో తలపడ్డ సీనియర్లు, జూనియర్లు


హైదరాబాదు పాతబస్తీలోని ప్రగతి కళాశాలలో జరిగిన దారుణం మరువకముందే మరో కళాశాలలో జూనియర్లు, సీనియర్ల మధ్య చిచ్చు రేగింది. పాతబస్తీ దారుస్సలాంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. దీంతో సీనియర్లు, జూనియర్లు కత్తులతో దాడులకు తెగబడ్డారు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న జన్నత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా, అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థికి స్వల్పగాయాలవడంతో అతడిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, కళాశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News