: మెయప్పన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తక్షణం చర్యలు తీసుకోండి: బీసీసీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, మెయప్పన్ లపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నేడు బీసీసీఐని ఆదేశించింది. అందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తున్నామని తెలిపింది. మెయప్పన్ పై ఏం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తమకు తెలియజేయాలని, సూపర్ కింగ్స్ రద్దుపైనా అభిప్రాయం చెప్పాలని పేర్కొంది. కాగా, ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.