: రేపటికల్లా ఆస్తులు ప్రకటించాలని పార్టీ ఎంపీలు, మంత్రులకు బీజేపీ ఆదేశం


పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు రేపటి లోగా ఆస్తులు ప్రకటించాలని బీజేపీ ఆదేశించింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. అంతేగాక ఎార్టీ ఎంపీలంతా గ్రామాల్లో పర్యటించాలని కూడా చెప్పామన్నారు. అటు మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి పాలనలో మొదలైన స్వర్ణ యుగాన్ని ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ముందుకు తీసుకువెళుతున్నారని ఎల్ కే అద్వానీ అభినందించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడంపై పార్లమెంటరీ బోర్డు ప్రశంసించింది. ఇక ప్రధానమంత్రిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన అమర్యాదకర వ్యాఖ్యల అంశం కూడా చర్చకు వచ్చిందని నక్వీ తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించామని, మమతా నిరుత్సాహంతో అలా మాట్లాడారని అన్నారు.

  • Loading...

More Telugu News