: హిందూ మతం స్వీకరించిన 57 ముస్లిం కుటుంబాలు
కొన్ని తరాల కిందట ముస్లిం మతాన్ని స్వీకరించిన 57 కుటుంబాల వారు తిరిగి హిందూ మతంలోకి మారారు. ఆగ్రా పరిధిలో మొత్తం 200 మంది ముస్లింలు హిందూ మతం స్వీకరించారని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. మరింత మంది ఇదే దారిలో నడుస్తారని ఆర్ఎస్ఎస్ రీజనల్ హెడ్ రాజేశ్వర్ సింగ్ తెలిపారు. భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో 'పూర్వోంకీ ఘర్ వాపసీ' (తిరిగి పూర్వీకుల ఇంటికి) పేరిట తిరిగి హిందూ మతంలోకి తెచ్చామని, వీరికి కొత్తగా నామకరణం చేస్తామని ఆయన అన్నారు. వచ్చే క్రిస్మస్ రోజున 5 వేల మందికి పైగా ముస్లిం, క్రిస్టియన్లను తిరిగి హిందూ మతంలో చేర్చనున్నామని తెలిపారు. అలీఘడ్ లోని మహేశ్వరీ కాలేజిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎవరికైనా ధైర్యం ఉంటే అడ్డుకోవచ్చని సవాలు విసిరారు.