: జానకిరామ్ మరణానికి కారణమైన డ్రైవర్ కు రిమాండ్


టీడీపీ నేత నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ యలమంచి వెంకన్నను నిన్న మునగాల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు వెంకన్నను పోలీసులు నల్లగొండ జిల్లా కోదాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు వెంకన్నకు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News