: భారత మీడియా రంగంలో ప్రవేశించిన హఫింగ్టన్ పోస్ట్.కామ్


అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులున్న హఫింగ్టన్ పోస్ట్.కామ్ న్యూస్ వెబ్ సైట్ భారత మీడియా రంగంలో అడుగుపెట్టింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపిన హఫింగ్టన్ పోస్ట్ సోమవారం నాడు భారత్ ఎడిషన్ (www.huffingtonpost.com/news/india/) ను ప్రారంభించింది. భారత్ లో హఫింగ్టన్ పోస్ట్ కు సంబంధించిన బ్రాండింగ్ వ్యవహారాలు, అడ్వర్టయిజింగ్ లావాదేవీల్లో 'గ్రూప్ ఎం' సంస్థ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. గ్రూప్ ఎం ప్రపంచంలో అతిపెద్ద మీడియా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ గా వెలుగొందుతోంది. కాగా, హఫింగ్టన్ పోస్ట్ తో భాగస్వామ్యంపై 'టైమ్స్ ఇంటర్నెట్' సీఈవో సత్యన్ గజ్వాని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన సంస్థ అని, వార్తలందించడంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నారని తెలిపారు. హఫింగ్టన్ పోస్ట్ ఒరవడిని భారతీయులకు చేరువ చేయడంపై దృష్టి పెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News