: రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన క్లార్క్
ఊహించిందే జరిగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ ను మరోసారి వెన్నునొప్పి బాధించింది. ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో 84 బంతుల్లో 60 పరుగులు చేసి మంచి జోరుమీదున్న క్లార్క్ తీవ్ర నొప్పికి గురయ్యాడు. మైదానంలోకి ఫిజియోను పిలిపించుకున్నాడు. కానీ, ఫలితం లేకపోవడంతో నిరాశతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు. రోగర్స్, వాట్సన్ ఇద్దరూ ఔటయ్యారు. వార్నర్ 125 పరుగులతో, స్మిత్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.