: నేడు లంక అధ్యక్షుడు రాజపక్సకు తిరుపతిలో నిరసనల వెల్లువ తప్పదా?


శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు తిరుపతిలో నిరసనలు స్వాగతం చెప్పనున్నాయి. వెంకన్న దర్శనం కోసం ఆయన నేడు తిరుమల రానున్నారు. తమ పట్ల లంక వైఖరికి నిరసనగా రాజపక్స పర్యటనను తమిళులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుని తీరుతామని ఎండీఎంకే నేత వైగో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజపక్సకు నిరసన తెలిపేందుకు వైగో మద్దతుదారులు ఇప్పటికే తిరుపతితో పాటు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమిళులను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరుపతి, తిరుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేటి సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి రానున్న రాజపక్స రోడ్డు మార్గం మీదుగా తిరుమల చేరుకోనున్నారు. నేటి రాత్రి తిరుమలలో బస చేయనున్న ఆయన బుధవారం ఉదయం సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.

  • Loading...

More Telugu News