: నేను, షారుక్, సల్మాన్ కలసి సినిమా చేస్తే చాలా బాగుంటుంది: అమీర్ ఖాన్
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, తాను కలసి సినిమా చేస్తే చాలా బాగుంటుందని నటుడు, దర్శకుడు అమీర్ ఖాన్ అంటున్నాడు. అలా చేయడం తనకు కూడా సంతోషమని చెబుతున్నాడు. ఇటీవలే ఓ టీవీ కార్యక్రమం వేదికపై ముగ్గురు ఖాన్ లు కనిపించారు. ఈ సందర్భంగా సల్మాన్, షారుక్ తో సినిమా చేసే ప్లాన్ ఉందా? అని అమీర్ ను అడగ్గా, "మేం ముగ్గురం చేసే సినిమా ఎలా ఉంటుందా? అని చాలా ఎగ్జైట్ అవుతున్నా. ఒకవేళ ఏదైనా స్క్రిప్టు మేం ముగ్గురం కలసి చేసే విధంగా ఉంటే, మా వద్దకు వస్తే సంతోషంగా చేస్తామని చెబుతున్నా" అని చెప్పాడు.