: పర్యాటక రంగంలో వెనుకబడిన భారత్
అద్భుతమైన వారసత్వ సంపద, 365 రోజులూ విభిన్న వాతావరణంతో, ప్రకృతి సుందరంగా విలసిల్లే భారతావని పర్యాటక రంగంలో వెనుకబడింది. భారత్ ప్రపంచ పర్యాటక రంగాన 65వ స్థానంతో తృప్తిపడాల్సి వచ్చింది. టీటీసీఐ (ట్రావెల్ టూరిజమ్ కాంపిటేటివ్ ఇండెక్స్) 2013 ఎకనామిక్స్ బిజినెస్ ఫోరమ్ నివేదిక ప్రకారం మొత్తం 140 దేశాల్లో భారత్ 65వ స్థానంలో నిలవగా, ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో 11వ స్థానంలో నిలిచింది. కాగా, 2014-15 నాటికి 65 నుంచి 62కి చేరుకుంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు.