: సత్యం స్కాంలో రామలింగరాజుకు ఆరు నెలల జైలు శిక్ష


హైదరాబాదులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సత్యం కుంభకోణంలో తీర్పు వెల్లడించింది. మొత్తం ఆరు కేసుల్లో శిక్ష వెలువరించిన కోర్టు... రామలింగరాజుకు, రామరాజులకు 5 కేసుల్లో రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. రామ్ మైనంపాటికి మూడు కేసుల్లో రూ.10 లక్షల చొప్పున జరిమానా వేసింది. ఇక రామలింగరాజు, రామరాజులకు నాలుగు కేసుల్లో ఒక్కో కేసుకు ఆరు నెలల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అటు, రామ్ మైనంపాటికి 3 కేసుల్లో ఒక్కో కేసుకు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. వారితో పాటు సత్యం మాజీ డైరెక్టర్లు కృష్ణ జి పాలెపు, ఎన్ శ్రీనివాస్, వినోద్ కె దామ్, టీఆర్ ప్రసాద్ కు రూ.20 వేలు జరిమానా విధించింది. సత్యం సంస్థ మాజీ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్ కు 3 కేసుల్లో ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. కాగా, తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు ఆర్థిక నేరాల కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది.

  • Loading...

More Telugu News