: పదకొండేళ్ల వివాహబంధాన్ని ముగించిన పూజాభట్, మనీష్


ఒకప్పటి బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాభట్, మాజీ వీజే మనీష్ మఖీజా తమ పదకొండేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఈ మాజీ కథానాయికే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. "నేను, నా భర్త మున్నా పదకొండేళ్ల వివాహబంధం తరువాత విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడెలా స్నేహపూర్వకంగా ఉన్నామో, ఎప్పుడూ అలానే ఉండాలని అనుకుంటున్నాం" అని పూజాభట్ తెలిపింది. దర్శకుడు మహేష్ భట్ పెద్ద కుమార్తె అయిన పూజా 2003లో మనీష్ ను పెళ్లి చేసుకుంది. మనీష్ చానెల్ 'వి'లో వీజేగా పనిచేశాడు.

  • Loading...

More Telugu News