: విక్రమార్కుడు, మర్యాదరామన్నలో నటించాను కదా?: సోనాక్షిసిన్హా లాజిక్


తెలుగు సినిమాలు తనకు కొత్త కాదని అంటోంది బాలీవుడ్ బిగ్ హీరోల ఫేవరెట్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. 'లింగ' ఆడియో ఫంక్షన్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సోనాక్షి మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తారని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... తాను ఇదివరకే విక్రమార్కుడు, మర్యాదరామన్న సినిమాల్లో నటించానని, అయితే వాటి రీమేక్ చిత్రాల్లో బాలీవుడ్ లో నటించానని, ఆ రకంగా తనకు తెలుగు సినిమాలతో మంచి అనుబంధం ఉందని సోనాక్షి తెలిపింది. మంచి అవకాశం వస్తే స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించడానికి అభ్యంతరం లేదని తెలిపింది. సౌత్ లో సినిమా నటులను అభిమానించే విధానం తనకు ఇష్టమని చెప్పిన ఈ ముద్దుగుమ్మ, హైదరాబాదు రుచులను ఆస్వాదిస్తానని వెల్లడించింది.

  • Loading...

More Telugu News