: చిరుత చర్మం విక్రయిస్తూ పట్టుబడ్డారు
చిరుతపులి చర్మం విక్రయిస్తూ ముగ్గురు స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఉత్తరాఖండ్ లో జనావాసాల్లో చిరుతల సంచారం అధికమైపోయింది. అటవీ ప్రాంతాలు నెమ్మదిగా తగ్గిపోతుండడంతో చిరుతలు జనారణ్యంపై పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, డెహ్రాడూన్ లోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో అనిల్, సాజిద్, సర్తాజ్ అనే ముగ్గురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని మరో వ్యక్తికి విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్మాన్ని రెండు నెలల క్రితం మృతి చెందిన చిరుతపులి చర్మంగా గుర్తించారు.