: మిషన్ కాకతీయకు నిధులివ్వండి: ఉమాభారతిని కోరిన కేసీఆర్
చిన్ననీటి వనరుల పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మిషన్ కాకతీయ'కు నిధులిచ్చి సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్లమెంట్‌లోని శ్రమశక్తి భవన్ లో నేటి మధ్యాహ్నం ఆమెతో సమావేశమైన కేసీఆర్, మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాలని ఉమాభారతిని ఆహ్వానించారు. సత్వర తాగునీటి ప్రయోజన పథకంలో భాగంగా రూ.100 కోట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలని కోరగా, దీనిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉమాభారతి ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు.