: భువనేశ్వర్ కు గాయం... తొలి రెండు టెస్టులకు డౌటే!
టీమిండియా యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడేది సందేహంగా మారింది. భువీ ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. రెండో ప్రాక్టీసు మ్యాచ్ లో భువీ మైదానంలోకే దిగలేదు. ఫిజియో థెరపిస్ట్ సాయంతో గాయానికి ఐస్ ప్యాక్ పెట్టుకుని దర్శనమిచ్చాడు. ఆదివారం నాడు అడిలైడ్ ఓవల్ లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కు కూడా గైర్హాజరయ్యాడు. దీంతో, ఈ యువ స్వింగ్ బౌలర్ రేపటి మ్యాచ్ లో ఆడడంపై అనిశ్చితి ఏర్పడింది. కానీ, టీమిండియా మేనేజ్ మెంట్ మాత్రం భువీ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని ప్రకటించింది. ఇటీవల కాలంలో భువీ ఆధారపడదగ్గ బౌలర్ గా ఎదిగాడు.