: 30 లక్షలు దాటేసిన టీడీపీ సభ్యత్వం!


తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే 30 లక్షల మంది క్రియాశీల సభ్యులను నమోదు చేసుకున్న ఆ పార్టీ మరో పది రోజుల పాటు సభ్యత్వ నమోదును కొనసాగించనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లెస్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ, జనాల్లోకి దూసుకెళుతోంది. ఆ పార్టీ అధికారం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 25 లక్షలకు పైగా సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకోగా, తెలంగాణలో సభ్యత్వ నమోదు కాస్త నెమ్మదిగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ ఇప్పటికే 4 లక్షల మేర క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, సభ్యత్వాల నమోదుతో పార్టీకి రూ.30 కోట్ల మేర నిధులందాయి. ఈ నిధులను కార్యకర్తల సంక్షేమానికి వెచ్చించనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకా పది రోజుల పాటు కొనసాగనున్న సభ్యత్వ నమోదులో మరో 10 లక్షల మంది క్రియాశీల సభ్యులుగా నమోదయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News