: పార్లమెంటుకు వెళ్ళిన సీఎం కేసీఆర్


ప్రస్తుతం దేశ రాజధాని పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి ఉదయం పార్లమెంట్ కు వెళ్లారు. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులందరనీ ఒకే చోట కలవచ్చన్న ఉద్దేశంతో ఆయన పార్లమెంట్ కు వెళ్ళారని తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 1.15 గంటలకు కేసీఆర్ ను కలిసేందుకు కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ తరువాత వీలును బట్టి ఇతర మంత్రులతో కేసీఆర్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, అధికారుల పంపకాలు సహా పలు అంశాలను శాఖల వారీగా కేంద్ర మంత్రులకు గుర్తు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, తదితరులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం.

  • Loading...

More Telugu News