: పేదరికంలో పుట్టిన నేను ఎన్నో కష్టాలు పడి చదువుకున్నా: డిప్యూటీ సీఎం రాజయ్య
ప్రతి ఒక్క దళిత బిడ్డ ఉన్నత చదువులు చదవాలని టీఎస్ డిప్యూటీ సీఎం రాజయ్య పిలుపునిచ్చారు. కేవలం చదువు మాత్రమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. పేదరికంలో పుట్టిన తాను... ఎన్నో కష్టాలు పడి చదువుకున్నానని తెలిపారు. సాధించాలనే తపనతో చదవాలని... చదువుతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం ఆజాద్ నగర్ లో రాజయ్య ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.