: 'రోహ్ తక్ సిస్టర్స్' పై తాజా ఆరోపణ... వెలుగులోకి వచ్చిన మరో బాధితుడు!


బస్సులో ఆకతాయిలను కొట్టడం ద్వారా హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల పేర్లు జాతీయస్థాయిలో మార్మోగిపోయాయి. అయితే, వారు తాము వేల మందిని ఇలాగే కొట్టామని చెప్పడంతో, పలు సందేహాలు తలెత్తాయి. విచారించగా, ఆ అమ్మాయిల వ్యవహారశైలిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వేధిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసి, అబ్బాయిలను కొట్టి, డబ్బులు వసూలు చేసేవారని తెలిసింది. వారి బారిన పడ్డ ఎందరో వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. తాజాగా, మరో యువకుడు ఆ అక్కాచెల్లెళ్లు తప్పుడు కథనాలు అల్లుతున్నారని ఆరోపించాడు. వారిని వేధించానంటూ ఆరు నెలల క్రితం తనపై కేసు పెట్టారని వెల్లడించాడు. తద్వారా తాను కాలేజి మానేశానని, కేసును ఉపసంహరించుకునేందుకు వారికి కొంత మొత్తం కూడా చెల్లించాల్సి వచ్చిందని వాపోయాడు. అతని తండ్రి మాట్లాడుతూ, "పరువు కాపాడుకునేందుకు వారి పీడ వదిలించుకునేందుకు రూ.20,000 చెల్లించాం" అని వివరించారు.

  • Loading...

More Telugu News