: ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని


ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నద్దాతో భేటీ కానున్నారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన అభిల భారత వైద్య విజ్ఞాన సంస్థను (ఎయిమ్స్) నెలకొల్పే విషయానికి సంబంధించి ఆయన కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఏపీలో పలు దేశీయ విద్యా సంస్థలతో పాటు ఎయిమ్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పలు ప్రాంతాలను సూచించాలన్న కేంద్రం సూచనకు స్పందించిన ఏపీ సర్కారు గుంటూరు జిల్లాలో స్థలాన్ని ఎయిమ్స్ కోసం కేటాయించింది. అయితే, కొంతకాలంగా ఈ విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాక కేంద్ర ఆరోగ్య మంత్రిగా మొన్నటిదాకా హర్షవర్ధన్ కొనసాగగా, మొన్నటి మోదీ కేబినెట్ విస్తరణలో జేపీ నద్దా ఆ శాఖ బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో పాటు ఎయిమ్స్ నెలకొల్పే విషయానికి సంబంధించి చర్యలను వేగవంతం చేసే దిశగా కామినేని చర్యలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News