: అనకొండ కడుపులో గంట సేపు: టీవీ షో కోసం పాల్ రొసోలీ సాహసం


చిన్నపామును చూస్తేనే భయపడి పోతాం. అదే 20 అడుగుల పొడవైన పెద్ద అనకొండ కళ్ళముందు నిలిస్తే... ఇంకేమైనా ఉందా? గుండె ఆగిపోదూ! కానీ, పాల్ రొసోలీ అలాకాదు. ఏకంగా అనకొండ పొట్టలోకే వెళ్ళిపోయాడు. ఓ గంటసేపుండి బయటకు వచ్చాడు. ఈ కార్యక్రమం నిన్న డిస్కవరీ ఛానల్ లో ప్రసారమైంది. కోట్లాది మంది తిలకించారు కూడా. ఒక ప్రత్యేకమైన కార్బన్ ఫైబర్ సూట్ ధరించి పాల్ రొసోలీ ఈ ఫీట్ చేశారు. తొలుత రొసోలీని మింగేందుకు అనకొండ ఆసక్తి చూపలేదట. తప్పించుకొని పోతుంటే అనకొండను రెచ్చగొట్టి మరీ మింగేందుకు ముందుకువచ్చేలా చేసారని తెలుస్తోంది. అధునాతన సమాచార వ్యవస్థ, వీడియో కెమెరాలు తీసుకొని రొసోలీ అనకొండ కడుపులోకి వెళ్ళాడు. ఆ తరువాత అనకొండకు హాని జరగకుండా తాను ఎలా బయటకు వచ్చానన్న విషయాన్ని రొసోలీ వెల్లడించలేదు. అనకొండ క్షేమంగానే ఉందని మాత్రం చెప్పాడు. పెటా ప్రతినిధులు మాత్రం ప్రదర్శన కోసం ఓ మూగజీవాన్ని హింసించారని నిరసన తెలిపారు. 'ఈటెన్ ఎలైవ్' పేరిట ఈ షో 10వ తేదీన స్వీడన్, ఫైన్ ల్యాండ్, డెన్మార్క్ తదితర దేశాల్లో, 12న ఆస్ట్రేలియాలో, ఆ తరువాత ఇండియా, చైనాలలో బ్రాడ్ కాస్ట్ కానుంది.

  • Loading...

More Telugu News