: క్రికెట్ లో నేను సాధించాల్సింది ఇంకేమీ లేదు: సెహ్వాగ్


క్రికెట్ ఆటలో భారత్ కు ప్రాతినిథ్యం వహించాలనేది తన కల అని, ఆ కలను నెరవేర్చుకున్నానని డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇప్పటికే 100 టెస్టులను పూర్తి చేసుకున్న తనకు క్రికెట్ లో సాధించడానికి ఇంకేమీ మిగల్లేదని చెప్పాడు. ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని... క్రికెట్ ఆడటాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నానని, ఇంకొక మూడేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. భారత్ క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం ఒకింత సులభమే కావచ్చు కానీ, 10-15 ఏళ్లు కొనసాగడం మాత్రం అత్యంత కష్టమని సెహ్వాగ్ చెప్పాడు. రిటైర్ అయిన తర్వాత ఏమి చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News