: స్వల్ప అస్వస్థతకు గురైన ఒబామా
అమెరికా అధ్యక్షుడు ఒబామా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు పొడిబారిపోవడంతో పాటు గొంతు నొప్పి వంటి సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు. దీంతో, మేరీల్యాండ్ లోని నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ లో నిన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. యాసిడ్ రిఫ్లెక్షన్ తో ఒబామా అస్వస్థతకు గురయ్యారని... ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు.