: భగవద్గీతకు జాతీయ గ్రంధ హోదా కల్పిస్తాం: సుష్మా స్వరాజ్


హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గీతకు జాతీయ గ్రంధం హోదా కల్పిస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. భగవద్గీతకు 5,151 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలో జరిగిన గీతా ప్రేరణ మహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు ప్రకటన చేశారు. ఇందుకోసం పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెడతామని ఆమె వెల్లడించారు. భగవద్గీతకు జాతీయ గ్రంధం హోదాను ఇవ్వాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ చేసిన డిమాండ్ కు స్పందించిన సుష్మా, పార్లమెంటులో బిల్లు పెడతామని ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ భగవద్గీతను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహుమతిగా అందించారన్నారు. తద్వారా భగవద్గీతకు జాతీయ గ్రంధం హోదా వచ్చేసిందని ఆమె వెల్లడించారు. అయినా పార్లమెంటులో బిల్లు ద్వారా భగవద్గీతకు జాతీయ గ్రంధం హోదా కల్పిస్తామని ఆమె ప్రకటించారు.

  • Loading...

More Telugu News