: ఔదార్యం ప్రదర్శించిన కమెడియన్ అలీ... లోక్ అదాలత్ అభినందన


టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ తనను మోసం చేసిన ఓ మహిళపై ఉదారత ప్రదర్శించారు. వివరాల్లోకెళితే... అలీ 1998లో హైదరాబాదు శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సాంబశివరావు, శకుంతల దంపతుల నుంచి ఈ ఇంటిని కొన్నారు. అయితే, అప్పటికే సాంబశివరావు దంపతులు ఆ ఇంటిపై బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షలు రుణం తీసుకున్నారు. విక్రయం సందర్భంగా ఈ విషయాన్ని దాచారు. అయితే, ఆ ఇంటిపై రుణం ఉన్న సంగతిని బ్యాంకు అధికారులు అలీకి చెప్పారు. దీంతో, అలీ చీటింగ్ కేసు పెట్టారు. దానికి సంబంధించిన కేసు ప్రస్తుతం నాంపల్లి నాలుగో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. కాగా, జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా, న్యాయమూర్తి శ్రీదేవి నటుడు అలీతో మాట్లాడారు. సాంబశివరావు భార్య శకుంతల ప్రస్తుతం తిండికి కూడా గడవక నానా కష్టాలు పడుతోందని చెప్పారు. ఆమె దయనీయ పరిస్థితికి చలించిపోయిన అలీ కేసు వెనక్కి తీసుకుని తన మంచి మనసు చాటుకున్నారు. అలీ ప్రదర్శించిన మానవత్వం లోక్ అదాలత్ న్యాయమూర్తులను ఆకట్టుకుంది. వారందరూ అలీని అభినందించారు.

  • Loading...

More Telugu News