: ‘పీకే’ చిత్రాన్ని చూడాలని ప్రధానిని కోరనున్న అమీర్ ఖాన్


తన కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్ లో పాలుపంచుకోమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును మన్నించిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, తాను కూడా మోదీ ముందు ఓ ప్రతిపాదన పెట్టనున్నట్లు చెబుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ సహా భారత చలన చిత్ర రంగంలోనే అమితాసక్తి రేపుతున్న తన తాజా చిత్రం ‘పీకే’ను చూడాలని ప్రధానిని కోరతానని అతడు వెల్లడించాడు. ‘‘పీకే చిత్రాన్ని మోదీజీ చూస్తే బాగుంటుందనుకుంటున్నాను. అయితే, ప్రధాని మోదీ తీరిక లేకుండా గడుపుతున్నారని తెలుసు. అయినా, ఆయన నా చిత్రాన్ని వీక్షిస్తే చూడాలని ఉంది. నా చిత్రాన్ని చూడమని మోదీని కోరతా’’నని అమీర్ వ్యాఖ్యానించాడు. మరి అమీర్ ఖాన్ వినతిని ప్రధాని మోదీ మన్నిస్తారో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News