: ఇకపై అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు: కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ


రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, కార్మిక వాడల్లోనూ ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 లక్షల మంది యువతీయువకులకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News