: ఐఐఎస్సీకి అరుదైన గుర్తింపు...టైమ్స్ నంబర్ వన్ వర్సిటీగా ఎంపిక


బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అరుదైన ఘనతను చేజిక్కించుకుంది. 2015కు గాను టైమ్స్ నంబర్ వన్ వర్సిటీగా నిలిచింది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐఎస్సీ నంబర్ వన్ వర్సిటీగా నిలిచినట్లైంది. ఇదిలా ఉంటే టైమ్స్ ఇటీవల విడుదల చేసిన బెస్ట్ వర్సిటీల జాబితా తొలి 40 ర్యాంకుల్లో భారత్ కు చెందిన నాలుగు వర్సిటీలకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఐఐఎస్సీ తొలి స్థానంలో నిలవగా, ఐఐటీ, బాంబే (37), ఐఐటీ, రూర్కీ (38), పంజాబ్ వర్సిటీ( 39) తొలి 40 విద్యాసంస్థల జాబితాలో చోటుదక్కించుకున్నాయి. ఇక టాప్ 100 ర్యాంకుల్లో మరో 7 భారత వర్సిటీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

  • Loading...

More Telugu News