: మొయినాబాద్ లోని సొంత ఫామ్ హౌస్ లో జానకీరామ్ అంత్యక్రియలు


సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్న ప్రదేశాన్ని పంజాగుట్ట శ్మశాన వాటిక నుంచి మొయినాబాద్ లోని సొంత ఫామ్ హౌస్ కు మార్చారు. తొలుత పంజాగుట్ట శ్మశాన వాటికలోనే జానకీరామ్ అంత్యక్రియలు నిర్వహించాలని హరికృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయించినా అనంతరం వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసం నుంచి మొదలయ్యే జానకీరామ్ అంతిమ యాత్ర సాయంత్రం 4 గంటలకు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు చేరుకుంటుంది. అనంతరం ఆయన భౌతిక కాయానికి అక్కడే అంత్యక్రియలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News